ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త!

Doing these things early in the morning..but beware Tasmat!

0
104
Shot of an attractive young woman asleep in her bedhttp://195.154.178.81/DATA/i_collage/pi/shoots/783514.jpg

ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అందుకు కారణం మన జీవనశైలి విధానం. మానసిక ఆందోళన, తినే ఆహారం, కాలుష్యం, ఇతర ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక చాలా మంది ఉదయం నిద్రలేవగానే మొబైల్‌లో మునిగి తేలుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌ చాటింగ్‌లు, వీడియోలు చూడటం ఇలా ఎన్నో రకాలుగా ఫోన్‌లలోనే మునిగి తేలుతుంటారు.

ఉదయం లేవగానే సోషల్‌ మీడియాలో ఏం పోస్టులు వచ్చాయో చూసుకుంటారు. ఆ తర్వాత కొందరు యథావిధిగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ఉదయం నిద్రలేవగానే ఫోన్లకు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటివి చేయడం వల్ల మీ మూడ్‌ను పాడు చేయడమే కాకుండా మీరు రోజు హుషారుగా ఉండలేరని చెబుతున్నారు నిపుణులు.  అందుకే ఉదయం వాటిని ఉపయోగించకూడదంటున్నారు.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే కనీసం 20 సెకన్లపాటు మీ ముఖాన్ని చూసుకుని నవ్వుకోండి. అలాగే నిద్రలేవగానే ఏదైనా ఒక జోక్‌ చదవండి. నిద్రలేవగానే వెంటనే ఇంట్లో అందరికీ, కుదిరితో పక్కనున్న వారికి గుడ్‌ మార్నింగ్‌ చెప్పండి. ఇది మీ మూడ్‌ను ఉత్సాహంగా ఉంచేలా చేస్తుంది.

ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కొవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. అలాగే నిద్రలేచిన తర్వాత వ్యాయమం చేయడం అలవాటు చేసుకోండి. ఒక వేళ మీకు ఆ అలవాటు లేకపోయినా..అలవాటు చేసుకోవడం మంచిది. వ్యాయమం చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది.

నిద్ర లేవగానే రోజు హాయిగా ఉండడానికి మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది. అలా ప్రతి రోజు నిద్రలేవనగా ఇలాంటివి చేస్తే హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.