భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తున్నారా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

Doing this after a meal? Shocking ‌ topics in the study

0
239

ప్రతి రోజు ఉదయం లేచి బ్రష్‌ చేసుకోగానే చాలా మంది చేసే పని కాఫీ తాగడం. ఆ తరువాత టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. కొంతమంది ఉదయం లేవగానే కూల్‌డ్రింక్స్‌ అస్సలు తాగకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు మాత్రమే తీసుకోవడం మంచిది.

చాలా మంది భోజనం చేశాక ఏదో ఒకటి తింటుంటారు. అలా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత రకరకాల పనులు చేసి అనారోగ్యానికి గురవుతుంటారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో కొన్ని షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి.

చాలా మందికి అన్నం తిన్న వెంటనే ఏవైనా పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ అలా తినడం అసలు మంచిది కాదు. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వలన ఆ పోషకాలన్ని కోల్పోతాము. అందుకే భోజనం తర్వాత గంట వరకు అసలు ఎలాంటి పండ్లను తినకూడదు.

ఇక మరికొందరికి భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయండి.

కొందరికి భోజనం చేయగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలాగే నిద్రపోతుంటారు. కానీ అలా చేయకూడదు.