పెరుగు ని ఈ ఆహారంతో అస్సలు కలిపి తీసుకోవద్దు

0
140

పిల్లలు పెద్దలు అందరూ కూడా పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు పెరుగు తింటే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు అనేది తెలిసిందే. పెరుగులో కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక బీపీ సమస్య ఉన్న వారు కూడా కచ్చితంగా పెరుగు తింటే రక్తపోటు సమస్య తగ్గుతుంది.

పెరుగుని మనం ఎక్కువగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. కానీ కొన్ని రకాల ఆహారాలతో పెరుగు తీసుకోవద్దు అని చెబుతున్నారు నిపుణులు. మామిడి పండుతో పెరుగు తీసుకోవద్దు ఇలా తింటే అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయలతో కలిపి పెరుగు అస్సలు వద్దు. రాత్రి పెరుగు అన్నం తోడుబెట్టి, ఏకంగా అందులో ఉల్లి మిర్చి వేసి ఉదయం తింటారు చాలా మంది. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే? ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే, పెరుగు చల్లదనానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్, దద్దుర్ల సమస్యలు వస్తాయట.

ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదు. డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు, పిల్లలకు వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది. పెరుగు, చేపలు ఈ రెండింటిలో ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. అందుకే రెండు కలిపి తీసుకోవద్దు. గ్యాస్ అసిడిటీ సమస్యలు వస్తాయి.