ఆనందయ్య మందుపై డాక్టర్ మంతెన సత్యనారాయణ క్లారిటీ

dr manthena satyanarayana anandhiah covid medicine anandhiah ayurvedic medicine anandhiah ayurveda medicine for covid anandhya medicine for corona patients

0
86

కరోనా పోరులో భాగంగా ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొణిగె ఆనందయ్య. ఆయన మందు పంపిణీ చేస్తున్న మందు విషయంలో ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ స్పందించారు. ఈ మందు గురించి ఒక వివరణతో కూడిన వీడియోను ఆయన పోస్టు చేశారు. ఆ వీడియోలో పేర్కొన్న వివరాలు ఇవీ.

 

ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు బాగా పాపులర్ అయింది. ఆక్సిజన్ తగ్గిన వారు, వెంటిలేటర్ మీద ఉన్నవారికి కంట్లో చుక్కలు వేస్తే ఎంతో మంది కరోనా నుంచి బయటపడుతున్నారు అని ప్రచారం జరిగింది.

వైరస్ వచ్చిన వారికి, వైరస్ రాని వారికి రాకుండా ఆనందయ్య మందు ఇస్తున్నారు. ప్రభుత్వం ఆ మందుపై వాస్తవాలు తెలిసే వరకు మందు పంపిణీని ఆపించింది.

ఆనందయ్య తయారు చేస్తున్న మందులో 18 రకాల ఆకులు, మూలికలు, ఔషధాలు కలిపి తేనెలో వేడి చేసి మందు రూపంలో ఇస్తున్నాడు.

దీన్ని రెండు పద్ధతుల్లో ఇస్తున్నారు. పొట్ట ద్వారా, కంటి ద్వారా అందిస్తున్నారు.

మొదటి రకం ముందుకు ‘‘బి’’ కోడ్ పేరు పెట్టారు. దీన్ని వైరస్ వచ్చిన వారు వేసుకోవచ్చు. వైరస్ రాకుండా ఉండేందుకు ముందస్తుగా వేసుకోవచ్చు. ఇది శ్వాస సంబంధమైన సమస్య రాకుండా ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

రెండో రకం మందు ‘‘పి’’ కోడ్ తో ఇచ్చేది. ఇది కరోనా పాజిటీవ్ వచ్చిన వారు మాత్రమే తీసుకోవాలి.

మూడో రకం మందు ‘‘ఎల్’’ కోడ్ మందు. ఇది కూడా పాజిటివ్ వచ్చిన వారు మాత్రమే తీసుకోవాలి.

4వ రకం మందు ‘‘కే’’ కోడ్ తో ఇచ్చేది . ఇది కూడా పాజిటివ్ వచ్చిన వారు మాత్రమే తీసుకోవాలి.

5వ రకం మందు కంట్లో వేసేది. ఇది ఎవరైతే ఆక్సిజన్ లెవల్స్ తగ్గి వెంటిలేటర్ మీద ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కంట్లో వేసేది. ఇది వాడితే ఆక్సిజన్ లెవల్స్ వెంటనే పెరుగుతున్నాయని అంటున్నారు.

ఈ మందులను ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మందు ఇచ్చే సమయంలో పలు జాగ్రత్తలు చెబుతున్నారు. మందు తీసుకున్న సమయంలో మాంసాహారం వాడకూడదు. పీరియడ్స్ సమయంలో 4 రోజులపాటు మహిళలు ఈ మందు వాడరాదు. గర్భవతులు కూడా ఈ మందు వాడరాదని చెబుతున్నారు.

ఆనందయ్య మందు ఇవ్వడం, మనం తీసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రకృతి సిద్ధమైన ఆకులు, మూలికలు, ఔషధాలే కదా? తీసుకుంటే ఇబ్బందేంటి అని అనం అనుకోవచ్చు…

 

ఉచిత మందు, వెంటనే రిలీఫ్ వస్తున్నది అన్న రెండు ప్రచారాలు జరిగే సరికి వేల మంది నెల్లూరు కృష్ణపట్నం వచ్చేస్తున్నారు. పాజిటివ్ రోగులు వేల సంఖ్యలో కృష్ణపట్నం వస్తున్నారు. కరోనా లేని వారు కూడా మందుకోసం వస్తున్నారు. పాజిటివ్ రోగుల వల్ల వీరికి కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉందని, గ్రామంలోని వారికి కూడా సోకే ప్రమాదం ఉందని ప్రస్తుతం మందు పంపిణీని ప్రభుత్వం ఆపించింది.

 

ఈ మందు వేలమందికి, లక్షల మందికి పంపిణీ చేసే ముందు ప్రభుత్వం నోటిమాటతో క్లియరెన్స్ ఇస్తే సరిపోదు. వాటి పట్ల పరిశోధన చేసి డాక్టర్లు నిరూపిస్తే తప్ప దీన్ని ప్రభుత్వం అందరికీ అందించే ప్రయత్నం చేయలేదు.

 

ఏదో పది మందికి తగ్గిందని ప్రభుత్వం వెంటనే దాన్న సర్టిఫై చేయడానికి చాన్స్ ఉండదు. ప్రస్తుతం దీనిపై పరిశోధన జరుగుతున్నది. ఈ మందుపై సందిగ్థత ఉన్నది. ప్రభుత్వం ఓకే చేయాలంటే డాక్టర్లు ఓకే చేయాలి. కంటి డాక్టర్స్ నుంచి కూడా అనాలసిస్ రావాల్సి ఉంది. క్షణాల్లో దీనిపై ప్రభుత్వం ఒక ఒపీనియన్ ఇవ్వడం అయ్యే పని కాదు. ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చే వరకు ఆగక తప్పదు. ప్రస్తుతం ఈ మందులో హానికరమైన మూలికలు ఏమీ లేవు, ప్రమాదకరమైనది కాదని ఎపి ప్రభుత్వ ఆయుష్ శాఖ కమిషనర్ రాములు గారు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ మందు వల్ల లాభమా? నష్టమా అన్నది తేల్చడానికి స్టడీ చేయడానికి కొంత టైం పడుతుందంటున్నారు.

 

అప్పటి వరకు మనం వేచి ఉండాల్సిందే. మన ఫాలోవర్స్ కూడా పాస్టింగ్ లో మందు వాడతానంటే అభ్యంతరం లేదు. అయితే మనం ఈ మందు గురించి అవగాహనతో కొంతకాలం వేచి చూడడం మంచిది.