భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా?

0
108

ప్రస్తుతం జీవనవిధానం మారింది. ఒకప్పుడు గటక, రాగి జావ వంటి పదార్ధాలు తీసుకునే వారు. ఆ తరువాత అన్నానికె ప్రాధాన్యత ఎక్కువ. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో నీళ్లను తాగుతుంటారు. కొందరు కారంగా ఉందనో మరే ఇతర కారణమో చెప్ప నీళ్లను తాగుతారు. మరి భోజనం చేస్తూ నీళ్లు తాగడం మంచిదో కాదో తెలుసుకుందాం..

కొందరు భోజనం చేసినంత సేపు నీళ్లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి భోజనం చేసే సమయంలో నీళ్లను అసలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. దాని వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయట.

అన్నం తినే సమయంలో నీళ్లను తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో గ్యాస్‌ సమస్య వస్తుంది. అలాగే అజీర్తి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారుతుంది. అది శరీరంలో చేరి నిల్వ ఉంటుంది. ఇలా తరచూ జరగడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. దీంతో డయాబెటిస్‌ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

ఇక అన్నం తినే సమయంలో నీళ్లను తాగితే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. ఇలా అనేక సమస్యలు వస్తాయి. కనుక అన్నం తినే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు.