చింతగింజలు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అలా చేయరు..

0
104

చింతకాయలతో వివిధ రకాల ఆహార పదార్దాలు చేసుకొని తింటుంటారు. దీని రుచి పుల్లగా ఉండడం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడతారు. అయితే కేవలం చింతకాయతోనే కాకుండా వాటిలో ఉండే చింతగింజలతో కూడా అద్భుత లాభాలు పొందొచ్చు అని తెలియక చాలామంది వాటిని అనవసరంగా పడేస్తుంటారు. అందుకే ఒక్కసారి వాటి లాభాలు తెలుసుకంటే మళ్ళి జీవితంలో పడేయ్యరు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..

చింతగింజలను వేయించి ఆ తరువాత పొడిలాగా చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవడం వల్ల చాలా లాభాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్‌ చొప్పున పాలు, నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. దాంతో పాటు రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా సహాయపడుతుంది.

అంతేకాకుండా దగ్గు, గొంతు సంబంధి సమస్యలున్నవారు ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తినుకుంటే ఈ సమస్య తగ్గడంతో పాటు ఎలాంటి హానికర వ్యాధులను మన దరికి చేరకుండా కాపాడుతుంది. ఇంకా  ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలు ఉన్న చింతగింజలను మళ్ళి పడేయ్యారు కదా!