ఈ ఐదు రకాల ఫుడ్స్ వేడి చేసి తినవద్దు చాలా డేంజర్

ఈ ఐదు రకాల ఫుడ్స్ వేడి చేసి తినవద్దు చాలా డేంజర్

0
99

చాలా మంది ఉదయం వండిన ఆహరం వేడి చేసుకుని తింటారు.. అయితే ఇలా అన్నీ ఆహర పదార్దాలు తినకూడదు అంటున్నారు నిపుణులు, కొన్ని ఆహారాలు శరీరానికి చేటు చేయవు, కాని మరికొన్ని మాత్రం చేటు చేస్తాయి, అయితే చాలా మంది అన్నం ఉదయం వండింది మళ్లీ కుక్కర్ లో వేడి చేస్తారు, ఇది చాలా డేంజర్, అలాగే కాస్త వాటర్ వేసి మళ్లీ అందులో అన్నం వండుతారు ఇలా కూడా చేయకూడదు.

ఎప్పుడూ అన్నం ఫ్రెష్ గా వండింది తినాలి. అలాగే నీరు వచ్చేసిన ఆహరం అసలు తినవద్దు. ఇలా అన్నం తింటే వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇక పుట్టగొడుగుల కూర కూడా వేడి చేసి తీసుకోకూడదు.

నిల్వ సరిగ్గా చేసిందే ఫ్రెష్ గా వండుకోవాలి, లేకపోతే స్కిన్ అలర్జీ కూడా వస్తుంది. బంగాళాదుంపలను వేడిచేయడం ద్వారా క్లొస్ట్రీడియమ్ బొటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇక ఫ్రిజ్ లోకూడా పెట్టి దుంపలు వాడకూడదు, ఇక పాలకూరతో చేసిన ఏ ఫుడ్ అయినా తిరిగి వేడిచేసి అసలు వాడవద్దు.

కోడి మాంసాన్ని ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. అలాగే సరిగ్గా ఉడకని చికెన్ మటన్ తినకూడదు, అలాగే ఉదయం చికెన్ మళ్లీ వేడిచేసి రాత్రి తినకూడదు ఇది చాలా డేంజర్.

వేడిచేసి తినేవి….నీరు ఎక్కువ వేసి పెట్టిన రసం, చారు , పప్పు, ఇలాంటి ఫుడ్ మంచిదే మితిమీరి వేడి చేయకూడదు. నిపుణుల సలహా ఈ సమయంలో కారం ఉప్పు మసాలా చింతపండులాంటివి వేడి చేసే సమయంలో అస్సలు వేయకూడదు.