ఏదైనా జబ్బు వచ్చింది అంటే ఇబ్బందే… అందుకే జబ్బు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి… ఆహారం కూడా మితంగా తీసుకోవాలి.. ఇక ప్రతీ ఏడాది లేదా ఆరు నెలలకు ఓసారి హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి.
ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ వ్యాధి వేధిస్తోంది, ఆ తర్వాత హైబీపీ లేదా లోబీపీ వేదిస్తోంది..ఈ రెండూ ప్రమాదకరమైనవే.
డయాస్టోలిక్ ప్రెషర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ ప్రెషర్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే… లోబీపీ ఉన్నట్లే. ఇక మహిళల్లో అయితే 60/100 కంటే తక్కువగా ఉంటే లోపీబీ కింద లెక్క. మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లే.
మరి ఈ లో బీపీకి లక్షణాలు ఏమిటి అనేది చూద్దాం
కొంచెం కళ్లు మసకగా డిమ్ గా అనిపిస్తాయి ఏదైనా చూస్తే
ఏ పని చేసినా అలసట వస్తుంది
కళ్లు చూస్తు ఉంటే అక్కడక్కడా చీకటి మచ్చలు కనిపిస్తాయి నల్లగా
హఠాత్తుగా తలనొప్పి వస్తుంది
వికారంగా ఉంటుంది.
కొందరికి మూర్ఛ కూడా వస్తుంది
అయితే ఇలా వారానికి రెండు మూడుసార్లు మీకు అనిపిస్తే ఆలస్యం లేకుండా వైద్యుని దగ్గరకు వెళ్లాలి
లో బీపీ అంటే బాడీలో సరిపడా రక్తం లేదని అర్థం. నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి.