వేసవికాలం ఈ సమయంలో దొరికే పండ్లలో అరటి ఎంతో ముఖ్యం అలాగే పుచ్చకాయ కూడా ఈ సమయంలో బాగా దొరుకుతుంది, అయితే వేసవిలో కచ్చితంగా పుచ్చకాయ తింటారు దీనికి కారణం అది శరీరానికి చలువ చేస్తుంది, ఇక నీటితో పుచ్చ కాయ ఉండటంతో దాహం లాంటి సమస్యలు ఉండవు.
పుచ్చకాయ రోజూ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అధిక బరువు సమస్యతో బాధ పడేవారు పుచ్చకాయ తింటే సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ పుచ్చకాయ తింటే సమస్య తగ్గించుకోవచ్చు. మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గని మల బద్దకం పుచ్చకాయ తింటే తగ్గుతుంది.
పుచ్చకాయ గింజలు శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఈ విత్తనాలలో ఉండే కాపర్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇక శరీరానికి వేడి తగలనివ్వదు, బీపీ సమస్య రానివ్వదు, శరీరానికి కొవ్వు వచ్చే సమస్య ఉండదు, సులువుగా జీర్ణం అవుతుంది. పుచ్చకాయ టాక్సిన్, దద్దుర్లు లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. పుచ్చకాయలో బి, సి విటమిన్లతో పాటు ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు లభిస్తాయి. ఇవి తింటే గుండె సమస్యలు కూడా దూరం అవుతాయి.