ఈ అమ్మాయిల‌కి శరీర‌మంతా వెంట్రుకలే – కార‌ణం ఇదే

ఈ అమ్మాయిల‌కి శరీర‌మంతా వెంట్రుకలే - కార‌ణం ఇదే

0
133

ఈ సృష్టిలో అంద‌రూ ఒకేలా ఉండ‌రు, అంద‌రూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండ‌రు, ఎవ‌రో ఒక‌రికి ఏదో ఓ అనారోగ్య స‌మ‌స్య ఉంటుంది, అస‌లు ఏ స‌మ‌స్య లేని వారు ఈ ప్ర‌పంచంలో అరుదు అనే చెప్పాలి, అయితే పుట్టుక‌తో కొంద‌రికి కొన్ని స‌హ‌జంగా వ‌స్తూ ఉంటాయి, అలాగే ఇక్క‌డ ముగ్గురు మ‌హిళ‌ల‌కు ఒళ్లంతా వెంట్రుక‌లు వ‌చ్చాయి.

వారి శ‌రీర‌మంతా వెంట్రుక‌లు పెరుగుతాయి. దీనిని హైప‌ర్‌త్రైకోసిస్ అని పిలుస్తారు. దీన్నే వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్ అని కూడా అంటారు ..తోడేలు మ‌నిషికి శ‌రీరమంతా వెంట్రుక‌లు ఉంటాయి అలాగే వీరికి ఉంటాయి అంటున్నారు నిపుణులు.

అయితే ఇలా వెంట్రుక‌లు వ‌చ్చే క‌ణాలు వారి శ‌రీరం అంతా ఉన్నాయి ఈ కార‌ణంతో స‌విత, మోనిషా, సావిత్రి ఈ ముగ్గురు అక్క చెల్లెల్ల‌కు వెంట్రుక‌లు వ‌చ్చాయి, ఇలా కోట్ల మందిలో ఒక‌రికి వ‌స్తుంది. ఈ స‌మ‌స్యతో వీరు చ‌దువుకి దూరం అయ్యారు, ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు, ఎవ‌రైనా వైద్యులు వీరికి సాయం చేయాలి అని కోరుతున్నారు వారి పేరెంట్స్ .