చెవిలో గులిమితో మీ ఆరోగ్యాన్ని చెప్పేయచ్చు – ఎలాగో తెలుసా

చెవిలో గులిమితో మీ ఆరోగ్యాన్ని చెప్పేయచ్చు - ఎలాగో తెలుసా

0
143

చాలా మంది ఇయర్ బడ్స్ పిన్నీసులు క్లాత్ లు దూది లాంటివి చెవిలో పెట్టి తిప్పుతూ ఉంటారు, చెవిలో గులిమి ఉంది అంటారు, లేదా వాటర్ వెళ్లింది అంటారు. దురద వస్తుంది అంటారు, ఇలా పలు సమస్యలు చెప్పి చెవిలో గులిమి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే బయటకు వచ్చిన ఆ గులిమితో మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా చెప్పవచ్చట.

ముందుగా ప్రతీ వారం చెవిలో గులిమి తీస్తుంటే భారీగా బయటకు వస్తుంటే అశ్రద్ద చేయవద్దు వైద్యులకి చూపించుకోవాలి, సాధారణంగా వస్తే ఏం పర్వాలేదు, అలాగే మీ చెవిలోని గులిమి బూడిద రంగులో ఉన్నట్లయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా గులిమి తీసిన సమయంలో చెవి నుంచి రక్తం చీము వస్తుంటే కర్ణభేరిలో పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించాలి. అది తీవ్రమైన నొప్పి వస్తుంది.

గులిమి గోదుమ రంగులో ఉంటే.. మీరు ఒత్తిడితో ఉన్నారని అర్థం. ఈ సమయంలో ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.నలుపు రంగులో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్గా భావించాలి.గులిమి తెలుపు రంగులో ఉంటే శరీరంలో విటమిన్లు లోపం ఉన్నట్లు, ఇక మీరు చేతికి దొరికిన పిన్నీసు రసాయనాలు తాళం చెవులు పెట్టకండి. దీని వల్ల ప్రమాదం, సొంత వైద్యం కంటే వైద్యుడి దగ్గరకు వెళ్లండి. డాక్టర్ సూచన లేకుండా మెడికల్ షాపు నుంచి నొప్పి వస్తుంది కదా అని ఇయర్ డ్రాప్స్ వాడద్దు.