శరీరం పసుపురంగులోకి మారడానికి గల కారణం ఇదే?

0
89

మనలో చాలామంది  క్యారెట్ల‌ను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని కొంతమంది పచ్చిగా తింటే మరికొందరు కూరల్లో వేసుకొని తింటుంటారు. అంతేకాకుండా వివిధ రకాల కూరల్లో వేసుకొని తినడానికి కూడా ఇష్టపడతారు. వీటిని ఎలా తిన్న సరే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా పొందొచ్చు అంటున్నారు నిపుణులు.

ఒక్క క్యారెట్ తినడం వల్ల సుమారుగా 4 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ శరీరానికి లభిస్తుంది. ఇది మనం తిన్నప్పుడు బీటా కెరోటిన్  శ‌రీరంలోకి ప్రవేశించిన అనంతరం  తగినంత బీటా కెరోటిన్‌ను గ్ర‌హించి దాన్ని విట‌మిన్ ఎ గా మార్చుకుంటుంది. మిగిలిన బీటా కెరోటిన్ రక్తంలో అధికంగా కలవడం వల్ల శరీరం పసుపు రంగుల్లోకి మారడం జరిగింది.

అందుకే క్యారెట్ల‌ను మోతాదుకు మించి తిన‌రాదు. ఒకవేళ తింటే అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  అంతేకాకుండా క్యారెట్ల‌ను పరిమిత స్థాయిలో తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు..కంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. క్యారెట్ లో రోదనిరోధక శక్తిని కూడా పెపొందించే మంచి గుణాలు ఉన్నాయి.