మీరు మైదా గోదుమపిండి వాడుతూ ఉంటారు కదా అయితే అందులోనే ఉంటుంది ఈ గ్లూటెన్. గోధుమల్లో బంకగా ఉండే పదార్ధాన్ని గ్లుటెన్ అంటారు. సో గోధుమలు మైదాతో తయారుచేసిన ఏ ఆహార పదార్థంలోనైనా ఇవి తప్పనిసరిగా ఉంటాయి.
పిజ్జాలు, పేస్ట్రీలు, కేకులు, స్వీట్సు, పలు రకాల బ్రెడ్లు ఈ మైదా గోదుమపిండితో తయారు చేస్తారు, సో అందులో ఈ గ్లూటెన్ ఉంటుంది.
ఈ పదార్థాలు ఎక్కువగా తినడం సిలియాక్ వ్యాధికి కారణమని చెబుతున్నారు.. సో అతిగా ఈ గ్లూటెన్ ఉన్న పదార్ధం తిన్నా ఇబ్బంది తప్పదు, చాలా మంది రైస్ మానేసి గోదుమలతో చేసే రొట్టె చపాతి తింటున్నారు దీని వల్ల కూడా కడుపు నొప్పి అజీర్తి సమస్యలు వస్తాయి.
సిలియాక్ వ్యాధి కూడా వస్తుంది…అంటే..అజీర్తి, కడుపు ఉబ్బరం, నీరసం, పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, ఎముకల బలహీనత ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, పది లేదా 15 రోజులకి ఓసారి తిన్నా పర్వాలేదు కాని నిత్యం ఇలా గ్లూటెన్ ఉండే ఫుడ్ తింటే ఇలాంటి కడుపు నొప్పి అజీర్ణ సమస్యలు వస్తాయి.
ReplyForward
|