పొట్లకాయ తింటున్నారా – సూపర్ దీని లాభాలు తెలుసుకోండి

Are You Eating snake gourd-Find out its benefits

0
179

పొట్లకాయ కూర వండాము అంటే ఈ రోజు నేను భోజనం చేయను అని కొందరు అంటారు. ఇలాంటి కామెంట్లు చేయకండి. ఎందుకంటే అది శరీరానికి చాలా మేలు చేస్తుంది. మంచి పోషకాలు శరీరానికి అందిస్తుంది. అందుకే పొట్లకాయని ప్రతీ పల్లెల్లో వారానికి ఓసారి కచ్చితంగా తీసుకుంటారు. మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ అందిస్తుంది.

అందుకే ఇన్ని పోషకాలు ఘనంగా ఉన్న దానిని పక్కన పెట్టవద్దు అంటున్నారు నిపుణులు వైద్యులు. షుగర్ వ్యాధికి పొట్లకాయ చెక్ పెడుతుంది. ముఖ్యంగా పొట్లకాయ ఫ్రై చాలా మంది చేసుకుంటారు. కాస్త వెల్లుల్లి దంచి అందులో వేస్తే మీకు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు కూడా రావు. ఇక క్యాలరీలు తక్కువ కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.

పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు ఉండవు, మరొక విషయం పొట్లకాయ చలువ చేస్తుంది వేడి చేయదు. బీపీ సమస్య తగ్గిస్తుంది. రక్త సరఫరా బాగుంటుంది. ఇక చదువుకునే పిల్లలకు కచ్చితంగా లంచ్ బాక్స్ ల్లో దీన్నీ అలవాటు చేస్తే పెద్ద అయ్యాక కూడా దీనిని ఇష్టంగా తింటారని వైద్యులు చెబుతున్నారు. కూర – ఫ్రై ఏదైనా వండిన 12 గంటల్లోపు తినాలి .రాత్రి వండిన కూర ఉదయం మాత్రం తినద్దు అంటున్నారు వైద్యులు.