శరీరానికి పాలు చాలా బలం అయితే కొందరు పాలు తాగరు. మరి మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఎలా పొందాలి అంటే వేరేరకాల ఆహర పదార్దాల నుంచి పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే మరి పాలతో పాటు ఎందులో ఎక్కువ కాల్షియం వస్తుంది . మరి పాలు అలవాటు లేని వారు ఏది తీసుకుంటే కాల్షియం వస్తుంది అనేది చూద్దాం.
డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. అయితే ల్యాక్టోజ్ కొందరికి పడదు వారు ఈ డైరీ ప్రొడక్టులు తీసుకోరు.
మరి కాల్షియం లోపిస్తే చాలా ప్రమాదాలు వెంటాడతాయి. ఆర్ధరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే పాలు, పాల ఉత్పత్తులు పడని వారు కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.
తెల్లనువ్వులు లేదా నల్ల నువ్వులు
అవిసె గింజలు
గసగసాలు
ఆకుకూరలు
మెంతికూర, మునగాకు.