ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!

0
103

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ముందు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాము. అలాగే మన జీవనశైలిని మార్చుకుంటే వైద్యుల వద్దకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పుకుంటా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య      ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహార పదార్దాలేంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగు: పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చక్కని మేలు చేకూరుతుంది. ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇందులో ప్రోటీన్లు,కాల్షియం, విట‌మిన్ బీ2, విట‌మిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగు పర్చడంలో ఎంతగానో సహాయపడతాయి.

మ‌సాలా దినుసులు: కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన వంటింట్లో మసాల దినుసులు అవశ్యం. వివిధ రకాల నొప్పుల నివారణ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. గాయాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

పప్పు: పప్పు దినుసుల్లో విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ, విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ, మెగ్నిషియం, ఐరన్‌, జింక్‌ కూడా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పు దినుసుల్లో ఫైబర్‌, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి కావడంలో సహాయపడతాయి. పప్పు దినుసుల్లో విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ, విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ, మెగ్నిషియం, ఐరన్‌, జింక్‌ కూడా లభిస్తాయి.