భోజనం చేసిన తరువాత వీటిని తింటే ప్రాణానికే ప్రమాదమట..

0
122

చాలామంది భోజనం చేసిన తరువాత అనేక తప్పులు చేస్తుంటారు. దానివల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవడంతో పాటు..ఆ సమస్యలను మనమే స్వయంగా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కావున భోజనం చేసిన తరువాత ఈ ఆహారపదార్దాలకు వీలయినంత దూరంగా ఉండడం మంచిది. అవేంటో మీరు కూడా తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారా? మరి ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..

సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత వివిధ రకాల పండ్లు తింటూ ఉంటాం. కానీ అలా తినడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఎందుకంటే జీర్ణాశయంలోకి చేరుకునే పండ్లు తేలికగా అరిగిపోయి, పేగుల్లోకి శోషణ చెందుతాయి. దాంతోపాటు పాటు ఈ పండ్లకు మనం తిన్న ఆహారం కలిసిందంటే ఆహారం త్వరగా జీర్ణం కాకపోగా..జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి.

మాంసకృత్తులు, పిండి పదార్థాలను కూడా తీసుకోకపోవడం మంచిది. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు ఘర్షణకు లోనై, కడుపులో గ్యాస్‌ పుట్టి కడుపు ఉబ్బిపోవడం వంటి సమస్యలు వస్తాయి.  చిలకడ దుంపలు, బియ్యంలాంటి కూడా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.