చికెన్ ను అధికంగా తింటున్నారా? అయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే..

0
113
Pieces of raw chicken meat. Raw chicken legs in the market.

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. నాన్‌వెజ్‌ ప్రియుల్లో చికెన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చికెన్ తో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ బిర్యాని, చికెన్ టిక్కా, హండీ చికెన్, కడాయి చికెన్, మొగలాయి చికెన్, చెట్టినాడ్ చికెన్ ఇలా అనేక రకాల వంటకాలు చేసుకొని తింటుంటారు.

చికెన్ ను ఎలా చేసుకొని తిన్న సరే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ పరిమితి స్థాయిని మించి తింటే అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చికెన్ లో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్ దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా చికెన్‌ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్ పెరుగుతాయని తేలింది.

దీనివల్ల గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇంకా చికెన్‌  అధికంగా తినడం వల్ల బరువు పెరిగే ఆస్కారం ఉందని తేల్చి చెప్పారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు చికెన్ వీలయినంత దూరంగా ఉండడం మంచిది. చికెన్ లో ఉండే డైరీ ప్రొడక్ట్స్, రెడ్‌ మీట్‌, చికెన్‌ స్కిన్‌‌లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని వెల్లడించారు.