అల్లం అధికంగా తింటే ప్రాణానికే ప్రమాదమట..!

0
101

అల్లంలో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధమని అందరికి తెలుసు. కానీ అల్లం అధికంగా తింటే కోరి సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?

ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ముఖ్యంగా చివరి మూడు నెలలు అల్లం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంలో చేర్చుకోకూడదు. ఇది సమయం పూర్తి కాకనే కాన్పు అయ్యేలా చేస్తుంది. అలాగే తీవ్రమైన కడుపు నొప్పికి దారి తీస్తుంది. మధుమేహం, హై బీపీ కోసం మందులు వాడేవారు తక్కువ పరిమాణంలో మాత్రమే అల్లంను తీసుకోవాలి. అల్లంను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ అల్లం తీసుకుంటే డయేరియా వచ్చే ప్రమాదం ఉండడంతో పాటు పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఛాతీ నొప్పి, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కూరల్లో అల్లం వీలయినంత తక్కువగా వేసుకోవడం మంచిది.