ఉప్పు మోతాదుకు మించి తింటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..

0
123

ప్రస్తుత రోజుల్లో తినే ప్రతీది టేస్టీగా ఉండాలని కోరుకుంటాం. ఇక ఇంట్లో వంట చేస్తే అందులో సరిపడ ఉప్పు, కారం, మసాలాలు ఉండాల్సిందే. అయితే ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు హొయలు పోతుంది. అందుకే ఉప్పుకు ఉన్న ప్రధాన్యత వేరు. కానీ ఉప్పు మోతాదుకు మించితే మనం డేంజర్ లో ఉన్నట్టే. అయితే రోజులు ఎంత ఉప్పు తీసుకోవాలి? మోతాదు మించితే జరిగే అనర్ధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల హైబిపి, ఊబకాయం, కిడ్నీలో రాళ్ళూ, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. అందుకే వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మాత్రం ఉప్పును నిగ్రహంగా వాడుకోవాలి. లేదంటే అది మనతో ఆడుకుంటుంది. మామూలుగా రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.

ఇక అంతకు మోతాదు మించితే మాత్రం నష్టం తప్పదని హెచ్చరించారు. WHO చేసిన సర్వేలో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకున్న వారిలో హైబిపి, గుండె జబ్బుల సమస్య పెరిగిపోతుందని వెల్లడించారు. అందుకే వీలైనంత తక్కువగా ఉప్పు తీసుకోవడం మంచిది.