ఇయర్ ఫోన్స్ అతిగా వాడాడు చివరకు ఇదే జరిగింది, నిపుణుల సూచనలు

ఇయర్ ఫోన్స్ అతిగా వాడాడు చివరకు ఇదే జరిగింది, నిపుణుల సూచనలు

0
132

చాలా మంది ఇయర్ ఫోన్స్ తెగ వాడుతూ ఉంటారు, అయితే ఇలా వాడటం మంచిది కాదు అని అంటున్నారు వైద్యులు నిపుణులు, ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ ఒకరి నుంచి మరొకరు తీసుకుంటూ ఉంటారు ..ఇది కూడా అంత శ్రేయస్కరం కాదు అంటున్నారు నిపుణులు, అక్కడ ఫంగస్ వేరే వారికి వచ్చే ప్రమాదం ఉంటుంది అంటున్నారు.

చెవి వినికిడి సమస్యల్లో ఎక్కువగా ఆస్పత్రికి వెళ్ళిన వారిలో ఇయర్ ఫోన్స్ వాడే వారే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది.ఇక 3 గంటలకు పైగా వాడే వారు చెవిలో దురద వంటి సమస్యలను చెప్పారు. ఇక యువకులు దాదాపు 28 ఏళ్ల లోపు వారికి ఈ సమస్య వస్తోంది అని చెబుతున్నారు.

ఇక ఇయర్ బడ్స్ మార్చకుండా వాడితే ఎలర్జీ వంటి సమస్యలు వస్తున్నాయని, చెవిలో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుందని చెబుతున్నారు, ఎవరిది వారు వాడుకోవాలి అని చెబుతున్నారు.
బీజింగ్ కు చెందిన పదేళ్ల బాలుడు గత కొన్ని రోజుల నుంచి చెవి నొప్పితో బాధపడుతున్నాడు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే అతనికి పరీక్షలు చేశారు.

బాలుడి చెవిలో దట్టంగా శిలీంధ్రాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల అతని చెవిలో బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగస్ గా తెలిపారు. అందుకే వీటికి కాస్త దూరంగా ఉండాలి అంటున్నారు, ఒకవేళ వాడినా 10 నిమిషాల కంటే ఎక్కువ వాడద్దు అంటున్నారు.