పిల్లలు దేవుడితో సమానం, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి, మనకి ఏదైనా సమస్య వస్తే చెప్పడానికి నోరు ఉంటుంది, ఏడాది పిల్లలు ఆ బాధ కేవలం ఏడుపు ద్వారానే చెబుతారు, అందుకే పిల్లల విషయంలో ఎంతో కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా సంవత్సరం వచ్చే వరకూ పిల్లలకు అనేక సమస్యలు అలర్జీలు వస్తూ ఉంటాయి, తరచూ వస్తూ ఉంటే వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లండి.
పిల్లలకు శరీరంపై దద్దుర్లు, ముక్కుకారడం, దురద, తుమ్ములు, దగ్గు వంటివి కలుగుతాయి. చంటి పిల్లలకు ఎనిమిది నెలల లోపు వచ్చే అలెర్జీలకు ప్రధాన కారణం పురుగులు, కీటకాలవంటివి కుట్టడం, ఇక పెట్టే ఆహరం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటిని పిల్లల దగ్గరకు పంపకండి, దూరంగా ఉంచాలి.
సాధారణ జలుబు పది రోజులకి మించి ఉండదు. కాబట్టి ఎక్కువ రోజులు పాటు జలుబు ఉంటే అది అలెర్జీ కావచ్చు. దగ్గులా వస్తున్నా అశ్రద్ద చేయవద్దు, ఇక ఆహరం పెట్టిన వెంటనే కక్కుకున్నా, చీముడు వస్తున్నా, జలుబు దగ్గు వస్తున్నా, ఆ ఫుడ్ ఆ చిన్నారికి పడటం లేదు అని గుర్తించండి.
ఇక పిల్లలను పడుకోబెట్టే సమయంలో పురుగులు, లేదా కీటకాలు ఉన్నాయేమో చుడండి, వారికి వాడే బట్టలు బాగా ఉతకాలి. రోజు విడిచి రోజు క్లీన్ చేయాలి, ఇక దుమ్ముపట్టే బొమ్మలు ఎక్కువగా ఇవ్వకండి డస్ట్ అలర్జీ వస్తుంది.