ఈ చిప్స్ ఎక్కువగా తింటున్నారా అయితే డేంజర్

ఈ చిప్స్ ఎక్కువగా తింటున్నారా అయితే డేంజర్

0
70

ఏదైనా టైం పాస్ సమయంలో చాలా మంది పాప్ కార్న్ దుంప చిప్స్ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు, ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది, ఇక నిత్యం పాప్ కార్న్ తినే వారు కూడా ఉన్నారు, అయితే ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

బ్రిటన్లో అయితే ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఎక్కువగా ఈ పాప్ కార్న్ చిప్స్ తింటున్నారట, దీని వల్ల అధిక బరువు పెరుగుతున్నారు అని గుర్తించారు, అందులో వేసే మసాలా సాల్ట్ కూడా ప్రమాదకరమని చెబుతున్నారు.

నెలకి లేదా రెండు నెలలకి తీసుకోవడం ఉత్తమం ..ప్రతీ రోజూ దీనిని తీసుకోవడం చేటు అంటున్నారు.. చాలా మంది ఒబెసిటీ సమస్యతో వచ్చేవారు కూడా ఇలాంటి చిప్స్ ఎక్కువ తింటున్నాము అని చెప్పారట, జీర్ణ సమస్యలు కూడా వస్తున్నాయి అని ఈ అలవాటు అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.