ఈ ఫుడ్ అసలు తినద్దు చాలా ప్రమాదకరం

ఈ ఫుడ్ అసలు తినద్దు చాలా ప్రమాదకరం

0
137

మనం తినే ఆహరపదార్ధాల బట్టీ మన ఆరోగ్యం ఉంటుంది, మనం ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెరిగే ఫుడ్ తింటే అనేక రోగాలు సమస్యలు కూడా వస్తాయి.. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని ఫుడ్ కూడా తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.

పాలిష్ పట్టిన బియ్యం, శుద్ది చేసిన గోధుమలతో తయారైన బ్రెడ్డు కూడా వద్దు అంటున్నారు, ఇలాంటి వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొవ్వు పేరుకుపోతుంది, గుండె జబ్బులు వస్తాయి.
బ్రెడ్ కూడా రోజు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. అలాగే బాగా పాలిష్ పట్టినపుడు బియ్యం పైన ఉండే తవుడు, పోషకాల వంటివి పూర్తిగా తొలగిపోతాయి. సో అతిగా తినద్దు అంటున్నారు నిపుణులు.

దంపుడు బియ్యం తింటే టైప్2 మధుమేహం వచ్చే అవకాశం 16 శాతం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.ముడి ధాన్యాలను కలిపి తీసుకుంటే ఇంకా మంచిది.. దంపుడు బియ్యం, నూనెగింజలు, చిరుపోషక గింజలు ఆకుకూరలు, పండ్లు, పాలు, బాదం ఇలాంటివి తీసుకోవడం ఉత్తమం. ప్రాసెస్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు, బంగాళదుంప చిప్స్, ఎనర్జీ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వీటికి చాలా దూరం ఉండాలి.