వేసవిలో మామిడి పండ్లుతో సౌందర్యాన్ని పెంచుకోండిలా?

0
106

అందంగా ఉండాలని అందరు ఆశపడతారు. ముఖ్యంగా మహిళలు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుత వేసవికాలంలో చాలామంది అనేక చర్మసమస్యలతో నానాతిప్పలు పడుతుంటారు. అందుకే ఎలాంటి చర్మ సమస్యలకైనా వెంటనే చెక్ పెట్టాలంటే మామిడి పండ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. మామిడిపండ్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మొదటి చిట్కా: 3 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి ,ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మరియు మామిడి గుజ్జుతో కలపండి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ముఖానికి సమానంగా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తరువాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మం కాంతివంతంగా, సౌందర్యవంతంగా తయారవుతుంది.

రెండవ చిట్కా: పండిన మామిడి నుండి గుజ్జును తీసుకొని 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి మరియు 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి కాసేపు వరకు మర్దన చేయాలి. ఆ తరువాత 15 నిమిషాల అరనిచ్చాక కడుక్కోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మొటిమలు ఇట్టే తొలగిపోతాయి.