కొబ్బరినీళ్లతో ముఖసౌందర్యాన్ని పెంచుకోండిలా?

0
108

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ  తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే..కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నీళ్లు అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలు దూరమౌతాయి.

కొబ్బరినీళ్లు మొటిమలను దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి మొటిమలున్న ప్రాంతంలో రాస్తే అనుకున్న దానికంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మచ్చలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి.

చెంచా పెసరపిండిని చెంచా కొబ్బరినీళ్లతో కలిపి ముఖానికి రాసి మృదువుగా రుద్దడం వల్ల ముఖం కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది. ఇంకా కొబ్బరినీళ్లను ముఖమంతా రాయడం వల్ల మురికి తొలగిపోతుంది. ముఖం కాంతివంతంగా కనబడాలంటే రోజు కొబ్బరినీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.