వ్యాయామంతో ఆరోగ్యం పదిలం-ఇంకా బోలెడు బెనిఫిట్స్!

0
108

రోజూ కనీసం గంటసేపైన వ్యాయామానికి, నడకకు కేటాయించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా ఇట్టే తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మసౌందర్యం కూడా మెరుగుపడడానికి వ్యాయామం తోడ్పడుతుంది. కానీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి సమయం దొరకడం లేదు. దానితో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు.

రోజులో కనీసం ఒక అరగంట నడకకు కేటాయిస్తే వ్యాయామం చేయకపోయినా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికి నడక అద్భుతంగా ఉపయోగపడుతుంది. వారానికి 7 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నడిచిన స్త్రీలలో రొమ్ముక్యాన్సర్‌ ముప్పు 14% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధిక బరువు, హార్మోన్‌ మాత్రలు వేసుకోవటం వంటి రొమ్ముక్యాన్సర్‌ ముప్పు కారకాలు గలవారికీ ఇలాంటి రక్షణ లభిస్తుండటం గమనార్హం.

కీళ్లవాపుతో తలెత్తే నొప్పులు తగ్గటానికి నడక దోహదం చేస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, సమస్య అంతవరకూ రాకుండానూ కాపాడుతుంది. వారానికి ఐదారు కిలోమీటర్లు నడవటం కీళ్లవాపు నివారణకూ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నడవటం వల్ల కీళ్లు.. ముఖ్యంగా ఎక్కువగా అరిగిపోయే అవకాశమున్న మోకీళ్లు, తుంటి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కండరాలు బలోపేతమవుతాయి.

“వ్యాయామం చేయండి..ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి” మీ ALL TIME REPORT………