దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. కర్ణాటకలో మరో ఐదు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. బాధితుల్లో నలుగురు మహిళలు ఉన్నారని ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. కొత్తగా నిర్ధరణ అయిన కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 19కు పెరిగిందని చెప్పారు. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 169కు పెరిగింది.
కేరళలోనూ కొత్తగా నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15కు పెరిగిందని కేరళ వైద్య శాఖ కార్యాలయం వెల్లడించింది.
దిల్లీలో కొత్తగా మరో ఆరు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది.