వర్షాకాలంలో ఈ ఫుడ్ కి దూరంగా ఉండాలి నిపుణుల సూచన

Experts recommend avoiding this food during the rainy season

0
74

వర్షాకాలంలో బయట ఫుడ్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి లేకపోతే అనేక రకాల వైరల్ ఫీవర్స్ జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు వేధిస్తాయి. ఇలా వర్షం కురుస్తూ ఉంటే చాలా మందికి బజ్జీలు లేదా పకోడిలు తినాలనిపిస్తుంది. కానీ వీటికి దూరంగా ఉండాలి అంటున్నారు వైద్యులు.

ఈ కాలంలో వెజిటేబుల్స్ తీసుకోండి నాన్ వెజ్ కి దూరంగా ఉండాలి. వర్షాకాలం క్యాబేజీ, కాలిఫ్లవర్ ఆకుకూరలు కాస్త తగ్గించాలి.
రోడ్ సైడ్ విక్రయించే తినుబండారాలకు దూరంగా ఉండాలి. మీరు ఏ కూరచేసుకున్నా వేడి నీటిలో కడిగి అప్పుడు మాత్రమే వాటిని వాడండి వంటకి. కచ్చితంగా నిమ్మకాయ అల్లం వెల్లుల్లి ఈ సీజన్ లో వాడాలి. ఇక కూరల్లో పసుపు వాడుకుంటే మంచిది

నేరేడు పండ్లు సి విటమిన్ ఉండే సిట్రస్ పండ్లు తీసుకోండి. డీప్ ప్రైడ్ ఐటెమ్స్ తినవద్దు. నువ్వులు కూడా తీసుకోవచ్చు. నీరు రోజూ నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగేలా ప్లాన్ చేసుకోండి. ప్రిజ్ లో నిల్వ ఉంచింది ప్రాసెస్ చేసిన ఫుడ్ అస్సలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింకులు ఐస్ క్రీమ్స్ కి ఈ రెయినీ సీజన్లో దూరంగా ఉండాలి.