సన్నగా ఉంటే వ్యాయామం చేయాలా..వద్దా?

0
76

సన్నగా ఉంటే వ్యాయామం అవసరం లేదనే అపోహలో చాలా మంది ఉన్నారు. కానీ సన్నగా, పీలగా ఉన్న వాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే డైట్‌తో పాటు వ్యాయామం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

క్రమం తప్పక వాకింగ్‌ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోనులు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రెగ్యులర్‌ వాకింగ్‌తో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ అరగంట వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

అలాగే పది నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం ఎనిమిది నిమిషాల నడకకు సమానం. స్కిప్పింగ్‌కు మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు రెండింతలుండాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో ముందుకు, వెనక్కు తిప్పి చూసుకోవాలి.

అప్పుడే కాళ్లకు అడ్డం పడకుండా క్రమపద్ధతిలో స్కిప్పింగ్‌ చేయగలరు. ఒకేవిధమైన ఎక్సర్‌సైజ్‌లు కాకుండా కాంపౌడ్‌ ఎక్సర్‌ సైజ్‌ లు అంటే క్వాట్స్, డెడ్‌ లిప్ట్, బెచ్‌ ప్రెస్, మిలటరీ ప్రెస్, డంబెల్‌ రో ప్రయత్నించడం వల్ల కండరాలు పటిష్ఠంగా తయారై, తీరైన ఆకృతిలోకి మారతాయి. మొదటి రోజు నుంచే వ్యాయామాలతో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టొద్దు, మోతాదును పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఫిట్‌నెస్‌ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.