చాలా మంది వ్యాయామం చేసిన తర్వాత నీరసం తలనొప్పి కండరాల నొప్పి వస్తున్నాయి అంటారు. ఒకరోజు చేసి నాలుగు రోజులు వ్యాయామం ఆపేసి మళ్లీ కొన్ని రోజులకి ప్రారంభిస్తారు.. దీని వల్ల ఎంతో ప్రమాదం అంటున్నారు నిపుణులు..వ్యాయామం చేస్తే నిత్యం చేయాలి, దీని వల్ల మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు.
వ్యాయామం చేశాక కచ్చితంగా డైట్ అనే మాట పక్కన పెట్టి తగిన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయడానికి ఓ అరగంట ముందు అరటి పండు లేదా రెండు ఖర్జూరాలు తీసుకుంటే అలసట వేయకుండా కావలసిన శక్తి వస్తుంది, కనీసం మంచి నీరు తాగకుండా చేయడం వల్ల శరీరానికి చేటు అనేది మర్చిపోకండి.
వ్యాయామం తరువాత వచ్చే తలనొప్పికి డీహైడ్రేషన్ కారణం కావచ్చు. మధ్యలో కొద్దిగా నీళ్లు తీసుకుంటూ ఉంటే అలసట లేకుండా ఎక్సర్సైజ్లు పూర్తి చేయగలుగుతారు. రోజుకి గంట సేపు వ్యాయామం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
వ్యాయామం పూర్తి అయ్యాక ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు, పాలతో చేసిన మిల్క్షేక్ కానీ, బాదం, ఆక్రోట్ లాంటి గింజలు, లేదా కొద్దిగా పళ్ళు, పెరుగు లాంటివి తీసుకుంటే మంచిది.
ఉదయం చికెన్ పప్పు ఇలాంటివి తినద్దు అంటున్నారు వైద్యులు, ప్రాసెస్ ఫుడ్ డ్రింక్స తీసుకోవద్దు.
ఇక ఒక అరలీటరు నీటిని వ్యాయామం తర్వాత గంటకి తీసుకోండి.
ఉడికించిన గుడ్లు, పప్పు ధాన్యాలు, ఉడికించిన శనగలు, రాజ్మా, అలసందలు తీసుకోండి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఇది మంచి ఆహరం, ఇక చికెన్ మటన్ వారానికి ఓసారి తీసుకుటే మంచిది. రోజుకి 7 గంటలు సుఖ నిద్రఉండాలి.