తెలంగాణలో భయం..భయం..వైద్యశాఖ హెచ్చరిక

Fear in Telangana .. Fear .. Medical department warning

0
101

ఇప్పడిప్పుడే కరోనా కాస్త నెమ్మదించింది అనుకుంటే..తెలంగాణను విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి.. కరోనా కాస్త నెమ్మదించగా ఒకవైపు డెంగీ, మలేరియా..ఇంకోవైపు సాధారణ వైరల్‌ జ్వరాల వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. గత 6 వారాల్లోనే ఆరోగ్యశాఖ 1.62 లక్షల మంది జ్వర బాధితులను గుర్తించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేలమంది బాధితులున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకూ 5,000కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. గత మూడు నెలల్లో వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంది. జ్వరాలు అధికంగా హైదరాబాద్‌లో నమోదవుతుండగా..మలేరియా కేసులు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్ధారణ అవుతున్నాయి. సాధారణ వైరల్‌ జ్వరాలూ విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలకు ఏ జ్వరమో అర్థంకాక ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

జ్వరమొస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాల మీదకు వస్తుందని వైద్యశాఖ హెచ్చరిస్తోంది. జ్వర లక్షణాలు కనిపిస్తే..వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తోంది. అదేవిధంగా ప్రజలంతా కచ్చితంగా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.