ఆహారం కంపుకొడుతున్నట్టు అనిపిస్తోందా కచ్చితంగా ఇది తెలుసుకోండి

Find out for sure -if the food feels trembling

0
95

ఈ కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మందికి పోస్ట్ కోవిడ్ లో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు. అయితే తాజాగా వైద్యులు కొన్ని విషయాలు తెలియచేస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ ఆహారం ముట్టుకున్నా కంపుకొడుతున్నట్టు అనిపిస్తోందా? అయితే మీరు పార్మోసియా బారినపడ్డారని అర్థమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాతో ఉన్న సమయంలో వాసన రుచి కోల్పోతున్నారు.

అయితే కోవిడ్ తగ్గిన తర్వాత కూడా చాలా మంది రుచి వాసన కోల్పోతున్నారు. జలుబు, లేదంటే వైరస్ కూడా పార్మోసియాకు ఓ కారణమని నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ అనారోగ్యం ఉంటే ఘ్రాణ శక్తి దెబ్బతింటుందని . శ్వాస ఎగువ భాగంలో వైరస్ సంక్రమణ కారణంగా ఘ్రాణ న్యూరాన్లు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు, ఎక్కువ శ్వాస సమస్యలు ఉన్న వారు, అలాగే పొగ పీల్చేవారిలో ఈ సమస్యలు ఉంటున్నాయి అని అన్నారు.