చాలా మంది ఉదయం ఆఫీసుకి వెళ్లే సమయంలో బ్రెడ్ జామ్ తింటారు లేదా బ్రెడ్ ఆమ్లెట్ తింటారు. ఇక పిల్లలకు కూడా చాలా మంది బ్రెడ్ జామ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వైద్యులు కొన్ని విషయాలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక మైదా గోధుమ పిండి పదార్థాలు అతిగా తీసుకుంటే శరీరానికి చాలా ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు.
ఇక గోధుమల నుంచి పైన పొట్టు మొత్తం తీసి మైదా తయారు చేస్తారు. దీని వల్ల అందులో ఉండే పీచు అంతా పోతుంది. అందుకే జిడ్డుగా కూడా మారుతుంది. ఇది మనకు శరీరంలో పేగులకి కూడా అంటుకుంటుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మలబద్దక సమస్య వస్తుంది అంటున్నారు వైద్యులు. బ్రెడ్ బన్ను అందుకే అతిగా వద్దు అని సలహా ఇస్తున్నారు.
పిజ్జా, బర్గర్, మోమోస్, బిస్కెట్ మొదలైన వాటిని తయారు చేయడానికి మైదా ఉపయోగిస్తారు. ఇక బ్రెడ్ తయారీలో కూడా దీనిని వాడతారు. ఏదో అప్పుడప్పుడూ పర్వాలేదు కాని నిత్యం బ్రెడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు.