మనకు అన్ని రకాల పోషకాలు అందితేనే ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ మధ్య చాలా మంది ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీని గురించి చాలా మందికి తెలియకపోవడం వల్ల ఈ ప్రోటిన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. మన శరీరానికి ప్రోటీన్ కూడా ముఖ్యం. శరీర పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. ప్రతిరోజూ కనీసం 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం అవసరం అని ఐసిఎంఆర్ చెబుతోంది.
అయితే ఎవరు ఎంత ప్రొటీన్ తీసుకోవాలి అనేది చూస్తే. మీ శరీర బరువు 60 కిలోలు ఉంటే, ప్రతిరోజూ 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ ప్రొటీన్ విషయంలో ఎంత తీసుకోవాలి అని తెలియక లోపంతో ఆస్పత్రికి వెళుతున్నారు. పప్పుధాన్యాల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది.గర్భిణీ, పాలిచ్చే మహిళలకు ఇది చాలా ముఖ్యం.
ప్రోటీన్ అధికంగా తీసుకున్నా ప్రమాదమే. మన శరీరంలో ప్రొటీన్ పెరిగితే శరీరం దానిని బయటు పంపలేదు. దాని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. దీని వల్ల రాళ్లు ఏర్పడటం మలబద్దకం, దుర్వాసన రావడం ఇలాంటివి జరుగుతాయి.