కంటికి ఇంపుగా కనిపించేవి అన్నీ మంచివి కాదు ఇది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.. మంచి ఆకర్షనీయమైన రంగుగా కనిపిస్తుంది అంటే దానిపై రంగు కలిపి ఉంటారు అనేది తెలుసుకోవాలి, నేచురల్ గా వచ్చేదానికి అంత రంగు రాదు అంటున్నారు నిపుణులు… ఇది ఏ వస్తువు విషయంలో అయినా ఇలాగే ఉంటుంది, అయితే పండ్లు కూరగాయలు కూడా చాలా మంది నేరుగా మార్కెట్ నుంచి తీసుకువచ్చి కూర వండుతూ పచ్చిగా తింటూ ఉంటారు.
అయితే వాటిలో కల్తీ ఉంటే తెలుసుకోవాలి…మీరు కొన్న చిలగడదుంపలు కల్తీవా, మంచివా తెలుసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి, రోడమైన్ బి అనేది ఒక పారిశ్రామిక రంగు. ఇది విషపూరితమైనది , ఇది నీటిలో కలిపి దేనిమీద అయినా రాస్తే అది ఎర్రగా మారుతుంది, గులాబీరంగులో మారుతుంది..
దీనిని కూడా కొందరు ఎర్రగా దుంపలు కనిపించడానికి రాస్తున్నారు, మరి ఎలా తెలుసుకోవాలి అంటే, కొంచెం కాటన్ ను తీసుకుని వెజిటల్ నూనెలో ముంచండి. తర్వాత చిలగడ దుంప తీసుకోవాలి, ఆ దుంపపై కాటన్ రుద్దండి, కాటన్ కు ఎరుపురంగు అంటుకుంటే అది రంగు కలిపింది…. లేదు సాధారణంగా ఉంటే అది మంచిది
…చిలకడ దుంప కల్తీది అయితే కాటన్ ఎర్రటి వైలెట్ రంగులోకి మారుతుంది.