మనం ఎక్కువగా వంటల్లో ఈ వంట ఆయిల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఈ మధ్య చూసుకుంటే ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి వంట చేయాలి అంటే ఆయిల్ కావాలి కాబట్టి దీని ధర ఎంత పెరిగినా అలాగే కొంటూ ఉంటున్నారు. మరో వైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలా కొందరు కేటుగాళ్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పలు రోగాలు వస్తున్నాయి. అయితే కల్తీ నూనె గురించి ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం. మన ఇంట్లోనే చిన్నపాటి ట్రిక్ తో వంటల్లో నూనె కల్తీదా ? మంచిదా అనేది తెలుసుకోవచ్చు. ఈ కేటుగాళ్లు వంటనూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. మరి ఇది కల్తీ లేదా మంచిది అనేది ఇలా తెలుసుకోండి.
రెండు మిల్లి.లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకోండి. అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలో వేయాలి.
ఇక మీకు రంగు మారకుండా నూనె ఉంటే అది చాలా మంచి నూనె అని అర్దం. అదే నూనె రంగు మారి ఎరుపు రంగు మారితే అది కల్తీ అయినట్లు అర్థం.
ఈ వీడియో చూడండి
https://twitter.com/fssaiindia/status/1438078684351533057
Detecting Tri-ortho-cresyl-phosphate Adulteration in Oil.#DetectingFoodAdulterants_6#AzadiKaAmritMahotsav@jagograhakjago @mygovindia @MIB_India @PIB_India @MoHFW_INDIA pic.twitter.com/YLRp7NzfEa
— FSSAI (@fssaiindia) September 15, 2021