మల్లెల తర్వాత చాలా మందికి ఇష్టమైన పూలు సన్నజాజి పూలు. పల్లె నుంచి పట్టణాల వరకూ చాలా మంది పెరట్లో ఇది పెంచుతారు. ఇది చాలా మంచి సువాసన ఇస్తుంది. అంతేకాదు సన్నజాజుల నుంచి వచ్చే సువాసన చాలా ఎక్కువ గంటలు ఉంటుంది. వీటిని మాలలు కడతారు పూజకి వాడతారు. ఇక సువాసన వచ్చే సెంట్లు తయారు చేస్తారు. అయితే సన్నజాజి పూలు మహిళలకు చాలా ఇష్టం. తలలో మంచి సువాసన ఇస్తాయి.
సన్నజాజి పువ్వులు,సన్న జాజి ఆకులు సంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతున్నారు. ఈ పూలతో తయారు చేసిన టీ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది అని చెబుతారు నిపుణులు. అంతేకాదు తైవాన్ మలేషియాలో దీని ఫ్లేవర్ టీ కూడా అమ్ముతారు.
ఒకసారి ఈ సువాన చూస్తే తలనొప్పి,ఆందోళన, చిరాకు, డిప్రెషన్ ఈ సమస్యలు తగ్గుతాయి. అందుకే చాలా మంది ఆందోళన ఉంటే ఈ పూల వాసన ఆస్వాదిస్తారు. అందుకే వీటికి అంత డిమాండ్ ఉంది. అయితే ఈ చెట్ల వల్ల కీటకాలు వస్తాయి అని కొందరు పెంచడం లేదు. కాని నిత్యం వాటిని శుభ్రం చేసుకుంటే ఎంతో బాగా ఎదుగుతాయి ఎలాంటి కీటకాలు చేరవు.