పిరియడ్ రాలేదు అంటే అది గర్భం అని మనవారు భావిస్తారు, అందుకే పది రోజులు ఆలస్యం అయితే వెంటనే వైద్యులని సంప్రదిస్తారు, అయితే పిరియడ్ మిస్ అవ్వడం వెనుక చాలా కారణాలు ఉంటాయి అంటున్నారు వైద్యులు.
గర్భం రావటం, మెనోపాజ్ రావటం లేదా ఇతరత్రా సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. మరి వీటిని మీరు ముందుగా తెలుసుకుంటే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు.
ఎందుకు ఇలాంటి ఇబ్బంది వస్తుంది అంటే, మానసిక ఆందోళన ఉంటే మీ రుతు చక్రం ట్రాక్ తప్పుకుంది, తప్పకుండా టెన్షన్ అనేది లేకుండా చూసుకోవాలి. 21-35 రోజుల మధ్య బహిష్ఠు అవ్వటం తప్పనిసరి అనేది మర్చిపోకండి.
హార్మోన్ల అసమతుల్యం కారణంగా నెలసరి సమయానికి రాకపోవచ్చు.
జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.
PCOD సమస్య ఉండవచ్చు
ఒత్తిడి ఎక్కువ ఉన్నా సైకిల్ గతి మారుతుంది
రక్తహీనత వల్ల కూడా ప్రమాదం ఉంటుంది
గర్భనిరోధక మాత్రలు చాలా డేంజర్ ఇది కూడా రుతుచక్రాన్ని మారుస్తాయి.
తక్కువ బరువు ఈ సమస్య కూడా వేధిస్తుంది
బీపీ, షుగర్, పేగులు ఆరోగ్య వంతంగా లేకపోయినా ఇబ్బందే
థైరాయిడ్ సమస్య ఉన్నా వస్తాయి
అతి వ్యాయమం చేసినా ఇబ్బంది
ఊబకాయం సమస్య ఉండకూడదు