పాములు క‌ల‌లోకి వ‌స్తున్నాయా అయితే ఇది తెలుసుకోండి

ముఖ్యంగా పాములు కలలోకి వస్తే ఏం జరుగుతుందో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు నిపుణులు

0
102

చాలా మందికి అనేక క‌ల‌లు వ‌స్తూ ఉంటాయి. క‌ల వ‌చ్చిన త‌ర్వాత ఈ క‌ల వ‌చ్చింది నాకేమైనా అవుతుందా అనే అనుమానం భ‌యం కూడా ఎంతో మందికి ఉంటాయి. ముఖ్యంగా అర్ధ‌రాత్రి క‌ల‌లు వ‌చ్చినా, తెల్ల‌వారు జామున క‌ల‌లు వ‌చ్చినా ఇలాంటి క‌ల‌ల విష‌యంలో చాలా భ‌యాలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఇక క‌ల‌లో కొన్ని వ‌స్తువులు, ఆకారాలు క‌నిపించినా అది అప‌శ‌కునం అని న‌మ్మేవారు ఉన్నారు.

ముఖ్యంగా పాములు కలలోకి వస్తే ఏం జరుగుతుందో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు నిపుణులు. మ‌రి చూద్దాం. పాము కాటేసినట్లు కలవస్తే ఏదో ఇబ్బంది రాబోతోంది అని మ‌నం గ్ర‌హించుకోవాలట‌. కొద్ది రోజులు ఏ ప‌ని చేసినా కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. చ‌చ్చిన పాము క‌ల‌లోకి వ‌చ్చినా కుటుంబంలో ఇబ్బందులు అని గ్రహించాల‌ట‌.

పాము మ‌న‌ల్ని త‌రిమిన‌ట్లు క‌ల‌వ‌స్తే అప్పుల బాధ‌లు పెద్ద స‌మ‌స్య వ‌స్తుంద‌ని గ్ర‌హించాలి. ఇక ప‌డ‌గ విప్పిన పాము క‌నిపిస్తే మీకు ఆరోగ్యంతో పాటు డ‌బ్బు కూడా ఉంటుంద‌ట‌. అయితే కొంద‌రు వీటిని న‌మ్ముతారు కొంద‌రు న‌మ్మ‌క‌పోవ‌చ్చు.