చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అందుకే చీపురుని చెత్త దగ్గర పెట్టరు. అంతేకాదు కాలితో తన్నరు మంచానికి చీపురు తగిలేలా చేయరు. ఇలా చీపురుని చాలా జాగ్రత్తగా వాడతాం. అయితే చీపురుకి సంబంధించి కొన్ని విషయాలు చెబుతున్నారు నిపుణులు. చీపురుని గది మూలన ఉంచాలి దేవుని గదిలో చీపురు పెట్టకూడదు. ఇంటికి ఎదురుగా చీపురు ఉండకూడదు.
బయట నుంచి వచ్చిన వారికి ఇంట్లో చీపురు కనిపించేలా కూడా ఉండకూడదు. ఇంటిలోని పశ్చిమ దిశలో చీపురు పెట్టడానికి సరైన ప్రదేశం. ఇంటిలో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఊడ్వకూడదు. విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రపరచడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తాయి. చీపురు విరిగినా మొత్తం పోయినా దానిని మట్టిలో వేయాలి.
ఇక చీపురుని ఉదయం పూట కొని తెచ్చుకోవడం మంచిదట. ఇంటిలో శుభకార్యాలు జరుగుతుంటే పాత చీపురు కంటే కొత్త చీపురు తెచ్చి వాడితే శుభసూచికం అంటున్నారు పండితులు.
గమనిక – వీటిని కొందరు నమ్ముతారు కొందరు నమ్మకపోవచ్చు కాని విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఈ విషయాలు పండితులు చెబుతున్నారు.