పంటినొప్పితో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి

Find out if you are suffering from toothache

0
96

చాలా మందికి పంటి నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇక దంతాల నొప్పి వల్ల ఏమీ తినలేరు. ఇక పన్ను కూడా తీయించుకుంటారు. ఇక చిగురు సమస్యలు పంటి సమస్యలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ వేధిస్తాయి. ఇక రూట్ కెనాల్ కొందరు చేయించుకుంటే, మరకొందరు క్యాప్ అనేది వేయించుకుంటున్నారు. ఇలా ఎందరో చిన్న పిల్లలు కూడా సరైన అవగాహన లేక పళ్లు చిన్నతనంలోనే పాడుచేసుకుంటున్నారు.

అయితే తీపి పదార్ధాలు తినడం వల్ల ఈ సమస్య కూడా వస్తుంది. పంటిపై ఉన్న ఎనామిల్ పాడవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం పిప్పళ్ల వంటివి ఏర్పడి నొప్పి కలుగుతుంది. అయితే ఈ పంటి సమస్య నుంచి బయటపడాలి అంటే నిపుణులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.

వెల్లుల్లి, లవంగంను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే తగ్గుతుంది
ఐస్ క్యూబ్ ని కూడా పంటి నొప్పి ఉన్న చోట ఉంచితే మంచిది
లవంగం పొడి లేదా లవంగం మొగ్గని పంటినొప్పి ఉన్న చోట పెడితే ఈ సమస్య పోతుంది
వేప పుల్లల‌తో పళ్లు తోముకున్నా చాలా మంచిది
పచ్చిఉల్లిపాయ నమిలినా ఈ నొప్పి అనేది తగ్గుతుంది

గమనిక..
అయితే కొందరికి ఇవి వాడినా తగ్గకపోతే వైద్యుల సలహా తీసుకోండి.