ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో చాలా మంది సబ్బు కంటే సున్నిపిండి వాడుతూ ఉంటారు, ముఖ్యంగా ఇది ఏనాటి నుంచో వాడుతున్నారు మన పెద్దలు… ఇక ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల సబ్బులు వచ్చాయి కాని గతంలో సున్నిపిండిని మాత్రమే వాడేవారు, అయితే ఇలా సబ్బుకి బదులు సున్నిపిండి వాడితే చాలా మంచిది అనేది తెలుసా.
సబ్బులు పైపై జిడ్డును మాత్రమే తొలగిస్తాయి. అంతే తప్ప చర్మ రంధ్రాల లోపల వున్న మురికిని శుభ్రం చేయలేదు.
సున్నిపిండి శరీరానికి చాలా మంచిది. ఇక బాడీలో పేరుకు ఉన్న మురికిని చెమట ద్వారా వచ్చే మట్టిని ఇది తొలగిస్తుంది, ఇక మీరు సమ్మర్ లో దీనిని వారానికి రెండు రోజులువాడినా చాలు దద్దుర్లు చెమట కాయలురావు.
ఆరోగ్యంగా వుంటుంది మీకు ఇలా స్నానం చేస్తే . చర్మ వ్యాధులు రావు. చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.మీరు సున్నిపిండితో స్నానం చేసి తర్వాత కొబ్బరినూనె రాసుకుంటే చాలా మంచిది ఇక చాలా మందికి దద్దుర్లు ఎర్రపొక్కులు వస్తాయి..నెమ్మదిగా సున్నిపిండి అలవాటు చేసుకోండి.. ఈ సమస్యలు తగ్గుతాయి అతిగా రాసినా రాషెస్ ఎర్రటి మచ్చలు వస్తాయి నిపుణులని వైద్యులని అడిగి వాడండి.
గమనిక.. మీరు నేరుగా శనగపప్పు మిల్లు పట్టించి ఇది వాడితే మంచిది మార్కెట్లో కొందరు ఇందులో కొన్ని రకాల పిండి కలిపి అమ్ముతారు ఇది కల్తీ అవుతుంది ఇది గమనించుకోండి.
.
|
|
సున్నిపిండి వాడుతున్నారా అయితే ఇది తెలుసుకోండి
-