ఆరెంజ్ దీని పేరు చెప్పగానే శరీరానికి మంచిది. దీని వల్ల సీ విటమిన్ శరీరానికి అధికంగా వస్తుంది అని మనం అనుకుంటాం.
నారింజలో విటమిన్లు , ఖనిజాలు, బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ ఉంటాయి. ముఖ్యంగా ఊబకాయ సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఫ్రూట్. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది తింటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అందుకే ఆకలి అనిపించదు. సో దీని వల్ల బరువు తగ్గుతాము. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మలబద్దక సమస్య తగ్గుతుంది. రోజుకి ఓ ఆరెంజ్ తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి.
చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖంలో గ్లో అనేది వస్తుంది.
- ఇది తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలదు.
- గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
- మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు.
- అయితే మంచిది కదా అని చాలా మంది రోజూ నాలుగు ఐదు తింటారు. ఇది మరింత చేటు చేస్తుంది.
- గ్యాస్ సమస్య పెరగవచ్చు.
- రోజూ ఏదైనా ఒకటి మాత్రమే మంచిది. అతి ఎప్పటికైనా చేటు అనేది మరవద్దు.