మీరు ఎక్కడ అయినా అబ్జర్వ్ చేయండి,మనలో చాలామంది భోజనం తరువాత ఏదైనా తీపిపదార్థం తింటారు. అరటిపండు లేదా స్వీట్ లేదా బెల్లం ముక్క ఇలా షుగర్ తినేవారు కొందరు ఉంటారు, అది వారికి బాగా అలవాటు అయి ఉంటుంది, అది మానలేక అదే అలవాటు చేసుకుంటారు.
అయితే ఇలా తినే అలవాటు ఉన్నవారు బయట ఉండే స్వీట్స్ కాకుండా ఈ రకం స్వీట్ తింటే మంచిది అంటున్నారు నిపుణులు…నెయ్యి, బెల్లం కలిపి తింటే మేలు చేస్తుంది అంటున్నారు…సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ కూడా ఈ మాట చెబుతున్నారు.
ఇలా తింటే ఆరోగ్యానికి మంచిది. బెల్లం, నెయ్యి మిశ్రమంలో ఐరన్, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి.నెయ్యి, బెల్లం కలిపి తింటే హార్మోన్ల పనితీరు బాగుంటుంది. మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది, మీ శరీరంలో ఉన్న విష పదార్దాలు అన్నీ నెయ్యి బెల్లంతో బయటకు వస్తాయి..నెయ్యిలో ఫ్యాటీ ఆమ్లాలు, ఎ, ఇ, డి విటమిన్లు ఉంటాయి. బెల్లం వల్ల ఎముకలు గట్టి పడతాయి.