గుడ్లు ప్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా ఓ సారి ఇది తెలుసుకోండి జర జగ్రత్త

Find out once the eggs are stored in the fridge

0
100

రోజు స్టోర్ కి వెళ్లి ,కిరాణా షాపుకి వెళ్లి కోడి గుడ్లు తీసుకురావడం చాలా మందికి కుదరదు. అందుకే ఒకేసారి ఓ ట్రే లేదా రెండు డజన్ల వరకూ తెచ్చుకుని కోడి గుడ్లు ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. కొందరు మాత్రం ఫ్రెష్ గా కోడి గుడ్లు తెచ్చుకుంటారు.
దాదాపు 90శాతం మంది గుడ్లను ఫ్రిజ్లో పెడతారు. ఇక ఇప్పుడు ఎవరు చూసినా ఫ్రిజ్ లో చిన్న ట్రే ఉంటుంది కాబట్టి అందులో స్టోర్ చేస్తున్నారు.

కానీ ఆ ప్రాంతంలో గుడ్లును స్టోర్ చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా పెడితే గుడ్లు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అందుకే గుడ్లు పాడవుతాయి అని అంటున్నారు. గుడ్లను ఎయిర్ టైట్ కంటెయినర్లో ఉంచి మూతపెట్టాలి.

ఆ కంటెయినర్ను ఫ్రిజ్లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిది డీప్ ఫ్రిజ్ లో మాత్రం గుడ్డు పెట్టవద్దు.
గుడ్లకూరను, ఉడకబెట్టిన గుడ్లను కూడా 12 గంటలు దాటి ఫ్రిజ్ లో పెట్టవద్దు. గుడ్లు స్టోర్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.