కాకరకాయ అంటే చాలా మందికి అమ్మో చేదు వద్దు అంటారు.. మరికొందరు మాత్రం ఆ చేదుని ఎంతో రుచిగా ఉంది అని తింటూ ఉంటారు, కాకరకాయ తింటే చాలా మంచిది, అయితే కూర ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కాబట్టి వేపుడు అలాగే కూర పులుసు పెట్టుకోవచ్చు, అయితే వారానికి లేదా పది రోజులకి ఓసారి కాకరకాయ తీసుకున్నా మంచిదే, మరీ ముఖ్యంగా కాకరకాయ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
కాకరకాయ జ్యూస్ తాగుతారు చాలా మంది దీని వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉండవు, క్రిములు ఉన్నా బయటకు పోతాయి, కాకరకాయ గింజలు తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలు ఉంటే తగ్గుతాయి …కూర చేసే సమయంలో ఆ గింజలు పాడేయకుండా వాటిని తింటే మంచిది అవి ఎక్కువ కాకుండా ఐదారు గింజలు తీసుకోండి.
కాకరకాయ జ్యూస్ తాగితే అది కడుపులో పురుగుల్ని చంపుతుంది. మీకు జలుబు, పడిశం, ముక్కు దిబ్బడ, కఫం వంటి సమస్యలు ఉంటే. ఇలా కాకరకాయ జ్యూస్ తీసుకోండి. ఇక కాకర ఆకు చేదుగా ఉంటుంది.. దానిని తీసుకున్నా మంచిదే. ఓ రెండు ఆకులు నోట్లో వేసుకోండి నోటి సమస్యలు తగ్గుతాయి జలుబు సమస్య తగ్గుతుంది.