డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా దీని వల్ల లాభాలు తెలుసుకోండి

Find out the benefits of eating Dragon Fruit

0
160

ఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల పండ్లను తినాలని చూస్తున్నారు. వైద్యులు కూడా అదే చెబుతున్నారు. అన్నీ రకాల పండ్లు తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఇప్పుడు చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారు. ఈ పండు తింటే చాలా పోషకాలు అందుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చాలా మంది ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి.

ఈ డ్రాగన్ పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉండటం వల్ల మలబద్దక సమస్య ఉండదు.ఈ పండులో ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ ఇలాంటి ఎన్నో విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే. కానీ శరీరానికి కూడా మంచి
లాభాలున్నాయి.

ఇక ఈ రెయినీ సీజన్లో వీటి అమ్మకాలు మరింత పెరిగాయి. ఇక ఈ పంట కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వేస్తున్నారు. గతంలో వేరే స్టేట్స్ నుంచి వచ్చే ఫ్రూట్స్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో దొరుకుతున్నాయి. ఇమ్యునిటీ పవర్ కోసం అందరూ వీటిని బాగా కొంటున్నారు.