ఆవనూనె వాడుతున్నారా దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి

Find out the benefits of using mustard oil

0
161

మనం వంట కోసం ఎక్కువగా సన్ ఫ్లవర్, పామాయిల్ ,వేరుశనగ వాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు చాలా మంది ఆయిల్ ఫుడ్ తగ్గిస్తున్నారు. కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయని అన్నీ రకాల ఆయిల్స్ వాడటం లేదు. దీంతో ఏ ఆయిల్ వాడితే మంచిది అని తెగ ఆలోచిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఆవ నూనె ఎక్కువగా వాడుతున్నారు. ఈ ఆవనూనె మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. అయితే ఆవాలు నుంచి తీసిన నూనెను వంటల్లో వాడితే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

ఇక్కడ వైద్యులు ఓ విషయం చెబుతున్నారు.. ఆవనూనె చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా చేస్తుంది. దీని వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు రావు. యాంటీ బాక్టీరియా,యాంటీ ఫంగల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి అందుకే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.

ఇక థైరాయిడ్ , మోకాళ్ల నొప్పుల సమస్యలు ఉన్న వారికి ఈ ఆవ నూనె చాలా మంచిది. కొవ్వు అధిక బరువు సమస్య ఊబకాయం తో బాధపడేవారు ఈ ఆయిల్ తో చేసిన వంటకాలు తీసుకుంటే మంచిది.