మీరు జూలై నెలలో పుట్టారా ఈ విషయాలు తెలుసుకోండి

Find out these things if you were born in the month of July

0
145

మనలో చాలా మంది జాతకాలు నమ్ముతారు. ఏడేట్, ఏ తిథి ఇలా పంచాంగం జాతకం అంతా తెలుసుకుంటారు. పిల్లలు పుట్టగానే వారి జాతకం చూపిస్తారు. ఇక జాతకం ప్రకారం దోషాలు ఉన్నాయా, శాంతులు పూజలు ఉన్నాయా అని చేయిస్తారు. మరికొందరు ఇలాంటివి అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా మనం పుట్టిన గడియను బట్టి మన స్వభావం ఆధారపడి ఉంటుంది అంటుంటారు పెద్దవాళ్లు.

ఇక వారు పుట్టిన సమయం బట్టీ కూడా వారి ఎదుగుదల ఉంటుంది అంటారు. రాత్రి పుట్టిన వారికి పగలు నిద్రపోయే అలవాటు ఉంటుంది అంటారు . ఇక సాయంత్రం జన్మించిన వారికి కోపం ఎక్కువ ఉంటుంది అంటారు. నెలల బట్టీ డేట్ బట్టీ ఈ స్వభావాలు మారతాయి అంటారు. మరి జూలై నెలలో జన్మించిన వారి గురించి నిపుణులు అధ్యయనాలు చేశారు వారు ఏమంటున్నారంటే.

జూలైలో కూడా చాలా మంది ప్రముఖులు జన్మించారు. ముఖ్యంగా ఈ నెలల జన్మించిన వారు ఉన్నత విద్యావంతులు అవుతారు. అనేక కంపెనీలు నడిపించే రథసారధులు అవుతారట. ప్రసిద్ధ రోమన్ హీరో జూలియన్ సీజర్ జూలైలో జన్మించారు. నెల్సన్ మండేలా, ప్రిన్సెస్ డయానా, జార్జ్ డబ్ల్యూ బుష్. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, రణవీర్ సింగ్, సౌరవ్ గంగూలీ, జెఆర్డి టాటా, కైలాష్ ఖేర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ ఈ ప్రముఖులు జూలైలో జన్మించారు. ఇక జూలైలో జన్మించిన వారు చాలా మంది ఎడమ చేతి వాటం కలిగి ఉంటారట. నిరుత్సాహం వారిలో అస్సలు ఉండదట. ఇక వీరికి ఇతరుల నుంచి సాయం తీసుకోవడం అస్సలు నచ్చదట.